Kshanamaina Maruvaledu Lyrics – Dr. V. Rangaraju & Sis. Glory Rani

Kshanamaina Maruvaledu Lyrics – Dr. V. Rangaraju & Sis. Glory Rani

Song : Kshanamaina Maruvaledu
Vocals: Bishop V. Rangaraju, Sankeerthana Grace, Michael Bright
Lyrics, Composition & Vocals:Sis. Glory Rani

Kshanamaina Maruvaledu Lyrics – Dr. V. Rangaraju & Sis. Glory Rani

పల్లవి:
శాశ్వతమైనది నీ కృప మా యెడల
నిన్న నేడు మారదు ఎన్నడూ విడువదు (2)

క్షణమైనా మరువలేదు గొప్ప వాత్సల్యముతో మమ్ము
సమకూర్చుచున్నావు నీవు రెండంతల దీవెనలతో (2)

చరణం 1:
కన్నీటితో విత్తుచు ఓపికతో ఎదురుచూచుచు
సహనముతో నీ కొరకు కనిపెట్టియుంటిని (2)
మా కొరకు గొప్ప కార్యాలు ఎన్నో చేయుచు
మా నోటినిండా నవ్వు నింపుచూ
సంతోషగానముతో పంటను కోయుచు
నీ కొరకు సాక్షిగా ఇలలో ఉందును

చరణం 2:
కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా
కరుణించు దైవమా నీ దయను కోరగా (2)
మా కొరకు వింత కార్యాలు జరిగించుచు
కొట్లుగానుగలు నిండ నింపుచు
కోల్పోయినవన్నీ మరల సమకూర్చుచు
మము సిగ్గుపరచని మా దేవుడవు

చరణం 3:
నీ యందే మేము సంతోషింతుము
నీ రక్షణలో ప్రహర్షింతుము (2)
మా మనవులన్నీ మన్నించుచు
మా ఆశలన్నీ సఫలపరచుచు
నీ దయ మాపై చూపించినా
మా తండ్రి నీకే స్తుతి స్తోత్రము

చరణం 4:
మా యెడల నీ తలంపులు విస్తారమైనవి
నీ ఆలోచనలు ఎంతో ఉన్నతం (2)
నీ వాక్యమును స్థిరపరచుచు
నీ ఆలోచనలు జరిగించుచు
వాగ్దానములన్నీ నెరవేర్చుచు
నిత్య నిబంధన చేసిన దైవమా

 

Kshanamaina Maruvaledu Lyrics – Dr. V. Rangaraju & Sis. Glory Rani

Pallavi:
Shashwathamanadhi nee krupa ma yedala
Ninna nedu maaradhu ennadu viduvadhu (2)

Kshanamaina maruvaledu goppa vatsalyamutho mammu
Samakoorchuchunnavu neevu rendanthala deevenalatho (2)

Charanam 1:
Kanneethitho vithuthu opikatho edhuruchoochuchu
Sahanamutho nee koraku kanippetti yuntini (2)
Ma koraku goppa kaaryalu enno cheyuchu
Ma notininda navvu nimpuchu
Santhoshagaanamutho pantanu koyuchu
Nee koraku saakshiga ilalo undunu

Charanam 2:
Krupa chooputalo aishwaryavanthuda
Karuninchu daivama nee dayanu koraga (2)
Ma koraku vintha kaaryalu jariginchuchu
Kotlugaanugalu ninda nimpuchu
Kolpoyinavanni marala samakoorchuchu
Samu sigguparachani ma devudavu

Charanam 3:
Nee yandhe memu santhoshinthumu
Nee rakshanalalo praharshinthumu (2)
Ma manavulanni maninchuchu
Ma aashalanni saphalaparachuchu
Nee daya maapai choopinchina
Ma thandri neeke sthuthi sthothramu

Charanam 4:
Ma yedala nee thalampulu vistharamanavi
Nee aalochanalu entho unnathamu (2)
Nee vaakyamunu sthiraparachuchu
Nee aalochanalu jariginchuchu
Vaagdhanamulanni neraverchuchu
Nithya nibandhana chesina daivama